శ్రీ పలుగు పోచమ్మ దేవస్థానంలో నీటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గ ంలో హత్నూర మండల పరిధిలోని షేర్ ఖాన్ పల్లి గ్రామ శివారులో గల శ్రీ పలుగు పోచమ్మ తల్లి దేవస్థానంలో నేటి నుండి బుధవారం నాడు ప్రారంభమయ్యా యి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదినం వారం రోజుల ముందుగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలతో పూజించి బ్రహ్మోత్సవాలు జరుపుతున్నామని ఆలయ అర్చకులు తెలిపారు ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ జాతర ఉత్సవాలు జరుపుకోవాలని అధికారులు ఆలయ అర్చకులు తెలియజేశారు ఈ జాతర ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు భక్తులు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శశిధర్ ఆలయ కమిటీ చైర్మన్ అర్చకులు శ్రీకాంత్ దశరథ్ లక్ష్మణ్ మరియు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు

.