తెలంగాణ ప్రభ (నర్సాపూర్): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు భూస్వామ్య వ్యవస్థకు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి భూమికోసం భుక్తి కోసం నైజాం రాజ్య తెలంగాణ ప్రాంత విముక్తి కోసం పోరాటం చేసిన సాయుధ పోరాట యోధులు కడవెండి వేగుచుక్క శ్రీ దొడ్డి కొమురయ్య గారు వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు దౌల్తాబాద్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద తెలంగాణ తల్లికి పూలమాలవేసి దొడ్డి కొమురయ్య గారికి పూలమాలతో సత్కరించి వారి జయంతి ఉత్సవాలను నిర్వహించి వారి త్యాగాన్ని కొనియాడడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో తొగరిపల్లి శ్రీశైలం కొముర గొల్ల నాగేష్ చంద్రయ్య గౌడి చర్ల శ్రీశైలం రాజు యాదవ్ కొన్యాల శ్రీశైలం బడంపేట మల్లేశం కడాల రాములు తదితర గొల్ల కురుమ సోదరులు వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది
