పోచమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలి
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధి విజయపురి కాలనీలోని శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారి నూతన విగ్రహ పున:ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారి ప్రతిష్టాపన మహోత్సవంలో నిర్వహిస్తున్న మహాగణపతి పూజ శాంతి హోమం, మహా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ గ్రామదేవతలను పూజించడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలలో భాగమని, అమ్మవారి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య , ప్రెసిడెంట్ ఎండి. రియాజ్, ప్రధాన కార్యదర్శి మల్లం శ్రీనివాస్ గౌడ్, అధ్యక్షులు బాలు నేత, శ్రీధర్, సుజాత, మహేష్, మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, కోశాధికారి శశి నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు జల్ద లక్ష్మీ నాద్, భాస్కర్ గౌడ్, మారుతి నగర్ అధ్యక్షులు గణేష్, మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు మదన్ గౌడ్, ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
.