టియుడబ్ల్యుజె జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుందని సంఘం జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని ఇది గుర్తించి రాజకీయ నాయకులు మసులుకోవాలని దాడులకు పాల్పడిన వారికి సూచించారు. మల్కాజ్గిరి బిజెపి అభ్యర్థి ఈటల రాజేంద్ర కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బిజెపి కార్యకర్తలు, నాయకులు కొందరు అక్రమంగా ప్రవేశించి దాడులకు పాల్పడడం దారుణం అన్నారు. ఇది మీడియాపై జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నామని తెలిపారు. బిజెపి నాయకులు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి విలేకరుల వద్ద ఉన్న మైకులను లాక్కొని, కుర్చీలను ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రెస్ క్లబ్ లో దాడులకు పాల్పడినటువంటి బిజెపి కార్యకర్తలను, నాయకులను వెంటనే గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులకు l
పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
.