మల్లన్న జాతరలో పాల్గొన్న నర్సాపురం ఎమ్మెల్యే సునీత రెడ్డి

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండల పరిధిలోని రెడ్డి ఖానాపూర్ గ్రామంలో సోమవారం నాడు శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలలో నరసాపురం ఎమ్మెల్యే సునీత రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున స్వామి నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలను అందరిని సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని ఆమె వేడుకున్నారు అంతేగాకుండా తనను నమ్ముకున్న బి.ఆర్.ఎస్ కార్యకర్తలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె అన్నారు కొంతమంది నాయకులు వారి సొంత ప్రయోజనాల గురించి పార్టీలు మారడం జరుగుతుందని ఆమె తెలిపారు వారిని ఎవరు పట్టించుకోవద్దని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో హత్నూర్ ఎంపీపీ నర్సింలు యాదవ్ సొసైటీ చైర్మన్ దామోదర్ రెడ్డి బి ఆర్ ఎస్ నాయకులు లింగారెడ్డి నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు

.