కుందేళ్ళ పెంపకంలో యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణ

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల లోని పశువైద్య కళాశాల, పశుగణ క్షేత్ర సముదాయం ఆధ్వర్యంలో గురువారం కుందేళ్ళ పెంపకంలో యాజమాన్య పద్ధతులు అనే అంశంపై రైతులకు శిక్షణ అందించారు. ఈసందర్భంగా కళాశాల అసోసియేట్ డాక్టర్ డీన్ టి. మాధవరావు మాట్లాడుతూ.. కుందేళ్ళ పెంపకం పై ప్రాముఖ్యత , మెలకువలు వివరించారు. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాన్ని అవిష్కరించి,శిక్షకులకు అందజేశారు. 

పశుగణ క్షేత్ర  సముదాయము  విభాగాధిపతి శ్రీదేవి మాట్లాడుతూ..కుందేలు ,బాతుల పెంపకంలో అవగాహన గురించి మాట్లాడారు. 

కుందేళ్ళ పెంపకంలో  యాజమాన్య పద్ధతులు, వ్యాధులు, నివారణ చర్యలు,కుందేళ్ళ దాణా తయారు,  పోషణ, బాహ్య పరాన్న జీవులు నివారణ, జాగ్రత్తలపై  డాక్టర్ ఎమ్ . వేంకటేశ్వరు ,

డాక్టర్ రాజేశ్వరి, ఆర్. సురేష్,ఎన్. రమ్య  ,ఎస్. శీరిష, బి.సామ్య లు మాట్లాడి మేడిపల్లి మండలంలోని తొంబారావు పేట్ గ్రామానికి చెందిన రైతులను అవగాహన కల్పించారు.

.