తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ కేంద్రంలో ఎల్వీ ప్రసాద్ అత్యుత్తమ కంటి ఆసుపత్రి బ్రాంచిని గురువారం బారాస పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అత్యుత్తమ కంటి వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా మెరుగైన వైద్య సేవలను అందించడంలో ఎప్పుడూ అగ్రభాగాన నిలిచిన దవాఖాన అని, ఎన్నో రకాల కంటి సమస్యలకు మెరుగైన వైద్య చికిత్స అందించడంలో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి ఎంతో కీర్తి గడించిందని. కంటి పరీక్షలు ఉచితంగా చేస్తారని, పేదవారికి ఉచిత ఆపరేషన్ చేస్తారని, కంటి అద్దాలు తక్కువ ధరలకే అందిస్తారన్నారు. దృష్టికి సంబంధించిన లోపాలు ఉన్నవారు వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఈ సేవలు సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల ఉంటుందన్నారు.
.