ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల పరిధిలోని   కొత్తపల్లి వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో గురువారం మహాజన సభ నిర్వహించారు.ఈ సర్వ సభ్య సమావేశంలో ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు డాక్టర్ వెనిగళ్ల సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగింది .ఈ సర్వసభ్య సమావేశానికి కొత్తపల్లి ప్రాథమిక సహకార సంఘం పరిధిలోగల కొత్తపల్లి దేవుని గుట్ట తండా అడకాస్ పల్లి, ఏ క్లాస్ పూర్, లింగాపూర్ రాంపూర్ సుద్దులమ్ తండా గ్రామాల రైతులు హాజరయ్యారు .   ఈ మహాజన సభ  సందర్భంగా ఈ తొమ్మిది గ్రామాల రైతుల ముందు పాలకవర్గ అనుమతితో సహకార సంఘం ఇన్చార్జి కార్యదర్శి జెశ్వాల్ కమలేష్ ఏప్రిల్ ఒకటి 2023 నాటి నుండి ఫిబ్రవరి 29  2024 వరకు జమ ఖర్చుల నివేదికను చదివి వినిపించారు. అనంతరం నూతనంగా జిల్లా డిసిసిబి ఇన్చార్జి చైర్మన్ గా  ఎన్నికైన కె. రమేష్ రెడ్డిని రైతులందరూ శుభాకాంక్షలు తెలిపారు . చైర్మన్ డాక్టర్ వెనిగళ్ళ సునీల్ కుమార్ అనంతరం ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు డాక్టర్ వెనిగళ్ళ సునీల్ కుమార్ చౌదరి మాట్లాడుతూ....  రైతులు బాగుంటేనే దేశమే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ఏప్రిల్ ఫస్ట్ కు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఎక్లాస్పూర్ లో 250 మెట్రిక్ టన్ను గోడౌన్ ను 21 లక్షల 25 వేల రూపాయలతో సుద్ధులం గ్రామానికి చెందిన దత్తతిరావు కాంట్రాక్టర్ ద్వారా నిర్మింణం చేపట్టడం జరుగుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శంకర్ ,తూకారం,శ్రీనివాస్ రావు,శ్రీ లత,సురేందర్,పీరాజి,నిరంజన బాయి,శంకర్,మాజీ సర్పంచ్ హనుమంతు,రైతులు సుధీర్ కుమార్,సైదయ్య,కృష్ణ సాయిలు గంగారాం పెద్ద సాయిలు,వెంకటేష్.తదితరులు పాల్గొన్నారు

.