తెలంగాణ ప్రభ (కోరుట్ల): మెటుపల్లి కోర్టులో న్యాయవాదుల అధ్యక్ష పదవికి గురువారం నాడు జరిగిన ఎన్నికలలో ఐదవ సారి అధ్యక్షునిగా పుప్పాల లింబాద్రి ని ఎన్నుకున్నందుకు న్యాయవాదులు అందరికీ కృతజ్ఞతలు.
గురువారం నాడు అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో లింబాద్రి కి 83 ఓట్లు రాగా సురక్ష కు 57 ఓట్లు రాగా 26 ఓట్ల మెజార్టీతో లింబాద్రి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు మగ్గిడి వెంకట నరసయ్య, సోమ భూమేశ్వర్, కోటగిరి వెంకటస్వామి, పసునూరి శ్రీనివాస్ లు తెలిపారు ప్రధాన కార్యదర్శిగా తునికి వేణుగోపాల్ ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు
ఈ సందర్భంగా అధ్యక్షుడు లింబాద్రి మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కొరకు కృషి చేస్తానని తెలిపారు
నన్ను గెలిపించిన న్యాయవాదులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు
.