ట్రాక్టర్ బోల్తా ఇద్దరు మహిళల మృతి

20 మంది మహిళలకు గాయాలు

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరు మహిళలు మృతి చెందడమే కాకుండా మరో 20 మంది మహిళలు గాయపడిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పెళ్లికి పెళ్లి కూతురును తీసుకురావడానికి వెళ్తున్న ట్రాక్టర్ సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం పరిధిలోని మన్సానిపల్లి గ్రామ శివారులో బుధవారం ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మహిళలు మృతి చెందగా మహిళల పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం సంగారెడ్డి వైద్యశాలకు తరలించారు. జోగిపేట ప్రభుత్వ వైద్యశాలలో గాయాలు తగిలిన 20 మంది మహిళలు జోగిపేట వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. పాపన్నపేట మండలం పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన వారు అందోల్ గ్రామంలో నుండి పెళ్లికూతురును తీసుకురావడానికి వస్తున్న క్రమంలో మనసన్పల్లి గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తా పడగా జుట్టు సంగమ్మ (45), రవి గారి బూదెమ్మ(52) అక్కడికక్కడే మృతి చెందగా ఇరువురి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం సంగారెడ్డికి తరలించారు. జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

.