కార్మికులకు సరియైన వేతనం అమలు పరచడంలో పరిశ్రమ ప్రతినిధుల అలసత్యం.
తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ 28 మార్చ్ నియోజకవర్గంలోని హత్నూర మండల పరిధిలోని చింతల్చెరువు గ్రామ శివారులో గల హైటెక్ పేపర్ పరిశ్రమ ముందు గురువారం నాడు కార్మికులు ఆందోళన చేపట్టారు తమకు కార్మిక చట్టం ప్రకారం వేతనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని యజమాన్యంపై తిరుగుబాటు చేశారు పరిశ్రమ ఎదుట కేటాయించి నిరసనలు తెలిపారు గత ఎనిమిది సంవత్సరాల నుండి పనిచేస్తున్న తమకు గుర్తింపు లేకపోవడం చాలా బాధాకరమన్నారు కంపెనీ చట్టాలను తుంగలో తొక్కి తమ శ్రమను దోచుకుంటున్నారని మహిళలు ఆరోపించారు పరిశ్రమ ప్రతినిధులు వెట్టి చాకిరి చేయించుకొని పిఎఫ్ ఎస్ఐ లాంటి సౌకర్యాలు లేకపోవడం చాలా బాధాకరమన్నారు పంపిణీ పరిశ్రమ యజమానులపై తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు
.