తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి లో నూతనంగా ఏర్పాటుచేసిన "ఏవీఎస్ ప్రీ స్కూల్" ను ఎమ్మెల్యే కేపీ. వివేకానంద జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు నిర్మాణంలో ప్రీ స్కూల్ లు ఎంతో దోహదపడతాయని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులు మొదటి గురువు అయితే, విద్యను బోధించేవారు రెండవ గురువని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ నిర్వాహకులు యశ్వంత్, ప్రసన్న, శ్రీకర్ గుప్త, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
.