జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి.

బిజెపి పార్టీ  బాన్సువాడ నియోజకవర్గ  ఇంచార్జ్ ఎండల లక్ష్మీనారాయణ. 

తెలంగాణ ప్రభ (కోటగిరి ): కోటగిరి మండల కేంద్రంలోని నూతన బిజెపి పార్టీ కార్యాలయాన్ని నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షురాలు అరుణతార కలిసి  ప్రారంభించారు.యెండల లక్మి నారాయణ  మాట్లాడుతూ.... పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మండల నాయకులకు, పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు మద్దతు ధర కన్నా 500 రూపాయలు అధికంగా ఇస్తానని ఇచ్చిన హామిని  నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం  వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం పై మండి పడ్డారు. కేంద్ర మద్దతు ధర కన్నా 200 రూపాయలకు తక్కువకు  రైతులు వడ్లను  అమ్ముకోవటం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, మండల పార్టీ అధ్యక్షులు వేముల నవీన్, నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు, అసెంబ్లీ కన్వీనర్ గుడిగుంట్ల శ్రీనివాస్ ,కో కన్వీనర్ కాపుగండ్ల శ్రీనివాస్,  ఆయ గ్రామాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.