తెలంగాణ ప్రభ ( కోటగిరి): పోతంగల్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు బిజెపి పార్టీలో చేరారు. వారికి కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండల లక్ష్మీనారాయణ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పొతంగల్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు ప్రకాష్ పటేల్, జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు,రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు మక్కయ్య,నాయకులు పటేల్ ప్రసాద్ , బాన్సువాడ నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్, కో కన్వీనర్ గాండ్ల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, బాన్సువాడ ఓ బి సి మోర్చా కన్వీనర్ నాగం సాయిలు, నాయకులు విజయ్ పటేల్, బాజరంగ్ హన్మండ్లు, సూదం అశోక్,
పార్టి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.