జాతీయ పార్టీలకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు

ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): తెలంగాణ భవన్లో జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

జాతీయ పార్టీల కంటే ముందుగా తెలంగాణలోని అన్ని స్థానాలలో అభ్యర్థులను ప్రకటించిన సత్తా ఉన్న పార్టీ బిఆర్ఎస్, సత్తా ఉన్న నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 

జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులు దొరకకపోతే కాళ్లు మొక్కి మరీ పోటీ చేయమని చెప్పి బ్రతిమిలాడుతున్నారు

అందరిని కలుపుకొని పోతూ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉత్సాహంగా దూసుకుపోతున్న అభ్యర్థి మన లక్ష్మారెడ్డి.

కార్యకర్తను అభిమానించే నాయకుడు లక్ష్మారెడ్డి.

అందరం కలిసికట్టుగా ఇంటింటికి తిరిగి పనిచేసి భారీ మెజార్టీతో రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం.

మనకు సమయం ఉంది కనుక ప్రణాళికా బద్దంగా పనిచేస్తూ జాతీయ పార్టీల మోసాలను ప్రజలకు తెలియజేయాలి.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ఏకైక పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనని, జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు చేసేవి ఏమీ లేవు..ఏమి చేయవు

.