పోలింగ్ నమోదులో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి
మెదక్ లో ఓటరు అవగాహనపై బైక్ ర్యాలీ
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్
తెలంగాణ ప్రభ (మెదక్): మెదక్ జిల్లాలో ఉన్న ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మెదక్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు కోరారు.
"నేను కచ్చితంగా ఓటు వేస్తాను మీరు కూడా ఓటు వేయండి" అనే నినాదంతో బుదవారం మెదక్ నూతన కలెక్టరేట్ కార్యాలయం నుండి మెదక్ రాందాస్ చౌరస్తా వరకు ఆయా శాఖ అధికారులు, పోలీస్ సిబ్బందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం పండుగ వాతావరణంలో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి జిల్లాలో అన్ని గ్రామాలలో ఓటు హక్కును వినియోగించుకోవాలని, అనేక అవగాహన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
నిష్పక్షపాతoగా, స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా జిల్లాలో ఉన్న ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
18 సంవత్సరాలు నిండి
కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని సత్తా చాటాలన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలింగ్ రోజు ఏక్కడికి వెళ్లకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు..
అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు మాట్లాడుతూ ఓటు ద్వారా చైతన్యం వస్తుందన్నారు. బాధ్యతగా ఓటు హక్కును వినియోగించి దేశాన్ని మర్చవచ్చన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రస్థాయి పోలింగ్ నమోదులో రెండవ స్థానం రావడం శుభ పరిణామం అని, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో మొదటి స్థానం కోసం ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఏ శ్రీనివాసరావు, డీఈఓ రాధా కిషన్, డీఎస్పీ డాక్టర్ రాజేష్, జిల్లా యువజన క్రీడా అధికారి నాగరాజు, DWO అధికారి బ్రహ్మాజీ, ఏవో యూనస్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
.