బైకును దహనం చేసిన దుండగులు

తెలంగాణ ప్రభ (చిలప్ చెడ్): మండల కేంద్రంమైన చిలప్ చెడ్ లో అర్ధరాత్రి గ్రామానికి చెందిన గాండ్ల రాములు బైకును గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం..అర్ధరాత్రి సమయంలో దుండగులు వచ్చి గేటుపై నుంచి దూకి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు గ్రామస్తులు తెలిపారు. అనంతరం బాధితుడు మాట్లాడుతూ కక్షపూరితంగా నా బైకును తగలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

.