తెలంగాణ ప్రభ (చిలప్ చెడ్): పనిచేసుకొని బతకాలని మందలించడంతో ఓ యువకుడు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చండూరులో జరిగింది. ఏఎస్ఐ మిస్బావద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చండూర్ గ్రామనికి చెందిన గుట్టమీది నర్సింలు(20)ను అతని చిన్నమ్మ అనిత ఏ పని చేయకుండా మద్యానికి బానిసై చెడు అలవాట్లకు గురవుతున్నాడని మందలించడంతో చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సురేష్ ఇంతకుముందు ఒకసారి ఆత్మహత్య చేయడానికి ప్రయత్నం చేశారు. మృతిని అక్క మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మిస్బావోదిన్ తెలిపారు.
