చెక్ పోస్ట్ వద్ద నగదు పట్టివేత

తెలంగాణ ప్రభ ( కోటగిరి): పొతంగల్ మండల కేంద్రంలోని పొతంగల్ మంజీరా నది చెక్పోస్ట్ వద్ద పోలీసులు రోజువారి తనిఖీలు నిర్వహిస్తుండగా మంగళవారం నాడు  మహారాష్ట్ర నుంచి mh 26 bc 8001 వెహికల్ ని  తనిఖీ చేయగా వెహికల్ యజమాని నాగేస్ షెట్కార్  అనుగొండ నాందేడ్ అను వ్యక్తి  నుండి 2 లక్షల 29 వేల రూపాయల నగదును  పట్టుకొని సీజ్ చేయడం జరిగిందని చెక్ పోస్ట్ పోలీస్ సిబ్బంది  తెలిపారు. ఆ నగదును బాన్సువాడ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పజెప్పడమైనదన్నారు.  ప్రతి వాహనదారుడు 50 వేల రూపాయల  కన్నా ఎక్కువ డబ్బులు ఉన్నచో సరైన ఆధారాలు చూయించి వెళ్లాలని వాహనదారులకు కోటగిరి ఎస్ హెచ్ ఓ తెలియజేశారు..

.