చందాపూర్ గేట్ వద్ద అంబలి కేంద్రం ప్రారంభం

గమ్యం అసోసియేషన్ చైర్మన్ సురేందర్ రెడ్డి 

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): హత్నూర మండల పరిధిలోని చందాపూర్ గేటు వద్ద మంగళవారం నాడు ఉచిత అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గమ్యం అసోసియేషన్ చైర్మన్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ చుట్టుపక్కల తీవ్ర ఎండ ఉండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు దాహం తీర్చడం కొరకు ఈ అంబలి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రోజు ఈ అంబలి కేంద్రం సరఫరా చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు రాబోయే రోజుల్లో గమ్యం అసోసియేషన్ తరపున ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నచో గమ్యం అసోసియేషన్ ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గమ్యం అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

.