అభయ హస్తం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో..
తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని అభయ హస్తం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని స్థానిక నాయకులు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ... మండల కేంద్రంలోని ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు దాహం తీర్చడం కొరకు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఎండాకాలం ఉన్నందున ఆయా గ్రామాల ప్రజలు అవసరాల నిమిత్తం కోటగిరి మండల కేంద్రానికి రావడంతో వారి దాహం తీర్చడానికి ఉదయం మజ్జిగతో పాటు త్రాగునీరును ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుందని వారు తెలిపారు. చలివేంద్రాన్ని ప్రారంభించిన ఫౌండేషన్ యాజమాన్యానికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారిని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్, మాజీ సర్పంచ్ బర్ల గంగారం, డిసిసి డెలిగేట్ కొట్టం మనోహర్ ,కొత్తపల్లి సహకార సంఘం అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, మాజీ జెడ్పిటిసి శివరాజ్ దేశాయ్, మాజీ ఎంపీటీసీ సలీం, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, బర్ల మధు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొల్లూర్ కిషోర్ బాబు, డిసిసి డెలిగేట్ సుంకిని హనుమంతు, కిసాన్ కేత్ మండల అధ్యక్షులు ఆనంద్, కప్ప గణేష్ ముదిరాజ్ ,సురేష్ గౌడ్, మండల మైనార్టీ నాయకులు అఫ్జల్ ,స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.