తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రిసెర్చ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డ్ పొందిన సామాజిక ఉద్యమనేత తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ ను జగిత్యాల ప్రజాసంఘాల జేఏసీ నాయకులు అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.
సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రం లోని జేఏసీ కార్యాలయంలో భారత్ బచావో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జయసింగ్ రాథోడ్,ప్రజాసంఘాల జేఏసీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోనగిరి మల్లారెడ్డి ఆద్వర్యంలో జిల్లా నాయకులతో కలిసి పేట భాస్కర్ ను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పేట భాస్కర్ విద్యార్థి దశ నుండే బడుగు బలహీనవర్గాల పక్షాన నిలబడడం అది ఇప్పటివరకు కొనసాగించడం భాస్కర్ చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడుతూ డాక్టరేట్ అవార్డ్ రావడం హర్షణీయమన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి, నాయకులు చెన్న విశ్వనాథం, పడాల జలందర్రెడ్డి,పిట్టల నారాయణ, ఎస్ రాజయ్య,చిర్ర చందు,శనిగారపు రాజేస్,జాగర్ల రాజయ్య,కల్లేడ రాజరెడ్డి, చిట్యాల అన్వేష్,సునీల్ ,గంగారాంలతో పలువురు నాయకులు పాల్గొన్నారు.
.