స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వారి గుంతం కృష్ణకు డాక్టరేట్ అవార్డు.

తెలంగాణ ప్రభ ( నర్సాపూర్): ఈరోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సిటీ కల్చర్ ఆడిటోరియంలో  ఇంటర్నేషనల్ అవార్డు స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవోస్ పూర్తి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ పీస్ ఆఫ్ ఇండియా  సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన డాక్టరేట్ అవార్డు కార్యక్రమంలో అరుదైన గౌరవం స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా సంస్థ వారు వరిగుంతం కృష్ణ గారికి సోషల్ సర్వీస్ కోటాలో డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా హత్నూర మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ వరిగుంతం కృష్ణ  మాట్లాడుతూ స్ఫూర్తి సర్వీస్ సొసైటీ చైర్పర్సన్ డాక్టర్ ఆకుల రమేష్ గారి చేతుల మీదగా డాక్టరేట్ తీసుకోవడం అదేవిధంగా నా సోషల్ సర్వీస్ గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషమైనదని ఆయన అన్నారు ఈ డాక్టరేట్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైనదని అదేవిధంగా ఇకముందు మరింత ఉత్సాహంగా సమాజ సేవలు చేస్తానని ఆయన తెలిపారు డాక్టర్ ఆకుల రమేష్ గారికి స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియన్ వారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది

.