టియూడబ్ల్యూజె జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి డిమాండ్
మెదక్ లో భగత్ సింగ్ కు నివాళులు
తెలంగాణ ప్రభ ( మెదక్ ): జర్నలిస్టుల డిమాండ్ లు కేంద్రం పరిష్కరించాలని టియూడబ్ల్యూజె మెదక్ జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి డిమాండ్ చేశారు.
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) పిలువు మేరకు షాహిద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్బంగా శనివారం మెదక్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలని, జర్నలిస్ట్ డిమాండ్ డేగా పాటించాలని నిర్ణయించిందన్నారు. ప్రెస్ కమిషన్ చివరి నివేదిక 1982లో వెలువడింది. గత నాలుగు దశాబ్దాలుగా దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా రాకతో మీడియా దృష్టాంతంలో పెనుమార్పు వచ్చిందన్నారు. మీడియా సమస్యలను పరిష్కరించడానికి కొత్త మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల కోసం వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. 2007 సంవత్సరంలో మజితియా వేజ్ బోర్డ్ ఏర్పాటు చేయబడిందని, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు వేతనాలు రెండుసార్లు సవరించబడ్డాయని తెలిపారు.
వినతిపత్రాలు అందజేత
అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలతో పాటు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా మా డిమాండ్లకు మద్దతివ్వాలని కోరుతూ బిజెపి అధ్యక్షులు నాయని ప్రసాద్, కాంగ్రెస్ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు గౌడ్ లకు వినతిపత్రాలు అందజేశారు. రాబోయే ఎన్నికలలో మీ అజెండాలో వాటిని చేర్చవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నాగరాజు, రాష్ట్ర దాడుల వ్యతిరేక కమిటీ సభ్యులు మిన్పూర్ శ్రీనివాస్, ఐజెయూ మాజీ సభ్యులు కంది శ్రీనివాస్ రెడ్డి, ఫారూక్ హుస్సేన్, జిల్లా నాయకులు సుమన్, ఫసియుద్దీన్, మురళీధర్, చింతల రమేష్, సిద్దేశం, రామన్న, గిరి, సుధాకర్, శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్, చంద్రశేఖర్, వసీం తదితరులు పాల్గొన్నారు.
