కొడిమ్యాల మండలం సండ్రాలపల్లి లో ఘనంగా భగత్ సింగ్ వర్థంతి

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని సండ్రాల పల్లి ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ 94 వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ 1931 మార్చి 23 న చనిపోయాడని, దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేసిన గొప్ప మహనీయుడని, ఈయన చిన్నతనంలోనే  చనిపోయాడని ఆయన  అన్నారు. 

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి,  విద్యార్ధులు పాల్గొన్నారు.

.