యూసుఫ్ నగర్ లో బస్సు షెల్టర్ ప్రారంభం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మండలంలోని యూసుఫ్ నగర్ గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద గ్రామానికి చెందిన మార్గం శోభన్ తమ యొక్క అమ్మమ్మ సామల్ల గంగుబాయి మరియు తండ్రి మార్గం కిషన్ గార్ల జ్ఞాపకార్థం 50వేల రూపాయలతో బస్టాప్ నిర్మాణం చేపట్టారు. 

అట్టి బస్ స్టాప్ ను మార్గం శోభన్ చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గుగ్గిల సురేష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన శోభన్  విశాల హృదయంతో ప్రయాణికుల సౌకర్యార్థం వారి అమ్మమ్మ మరియు తండ్రిగార్ల పేరు మీద బస్టాప్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని ఆయన అన్నారు గ్రామస్తులకు ఉపయోగపడే బస్టాప్ నిర్మించిన శోభన్ ను శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ సత్యనారాయణ, పల్లి తుక్కయ్య, శ్రీనివాస్, మల్లయ్య, లక్ష్మీరాజం, మల్లేశం, ప్రశాంత్, భూమేష్, వెంకయ్య, హరికృష్ణ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

.