చిలప్ చెడ్ బీజేపీ మండల అధ్యక్షునిగా శ్రీకాంత్ గౌడ్

తెలంగాణ ప్రభ ( చిల‌ప్‌చెడ్ ): చిల‌ప్‌చెడ్ బీజేపీ మండల అధ్యక్షునిగా రామగొని శ్రీకాంత్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నాడు మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికను నిర్వహించారు.మండలంలో ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా ఉండి  మండలంలో ఉన్న బిజెపి పార్టీని కార్యకర్తలకు అండగా నిలిచి పేద బడుగు, బలహీన వర్గాలకు ముందున్న నాయకుడిగా మంచి పేరు ఉంది. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తానని ఆయన అన్నారు. బీజెపి మండల క్యాడర్ సహకారంతో నన్ను అధ్యక్షుని చేశారని ఆయన అన్నారు. పార్టీ గెలుపుకు ప్రతిక్షణం పనిచేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అజ్జమారి మాజీ సర్పంచ్ నాగేష్ , సత్యనారాయణ గౌడ్, యాదగిరి, రమేష్ నాయక్, వెంకటేశం ,పాండురంగారెడ్డి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

.