అగ్రికల్చర్ ఏఈఓపై వైస్ ఎంపీపీ గరంగరం..
తెలంగాణ ప్రభ (చిలప్‌చెడ్ ): రైతులు పండించే పంటల్లో మందు సంచుల కన్నా స్ప్రేలకు ఎక్కువగా రైతులు పెట్టుబడి పెట్టారని, మండలంలో వ్యవసాయశాఖ ఫెయిల్ అయ్యారని చిలప్‌చెడ్ మండలం వైస్ ఎంపీపీ విశ్వంభరస్వామి అగ్రికల్చర్ ఏఈఓ భూపాల్ పై గరంగరం అయ్యారు. శుక్రవారం ఎంపీపీ వినోద దుర్గారెడ్డి అధ్యక్షతన చిలప్ చెడ్ మండలం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ విశ్వంభరస్వామి మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ అధికారులు విధులు సక్రమంగా చేయడం లేదని, రైతులు ఆందోళన చెందితే ఏం చేస్తున్నారని, ఏడీఏ ఎన్ని గ్రామాలు తిరిగారని ప్రశ్నించారు. మండలంలో చాలా స్కూల్లో టీచర్లు ప్రార్థనలు చేయడం లేదని,, సమయపాలన పాటించడం లేదని.. విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలని నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శశి ప్రభ, కో ఆప్షన్ మెంబర్ షఫీ, ఏపీఓ శ్యామ్, పిఆర్ ఏ మధుబాబు, ఎంపీ ఓ శరత్ కుమార్ రెడ్డి, అయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
