జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నిక

అధ్యక్షులు గా ఎన్నికైనా అది నర్సింలు 

తెలంగాణ ప్రభ (జిన్నారం)  జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ నూతన మత్స సహకార సంఘం ఎన్నికలను శుక్రవారం నిర్వహించారు. ఈరోజు  అధ్యక్ష ఉపాధ్యక్ష, పదవులకు ఎన్నికలను  నిర్వహించారు. జిల్లా మత్స్య సహకార సంఘం అధికారి సమక్షంలో జరిగిన ఎన్నికలో ఆది నర్సింలు సహకార సంఘం అధ్యక్షుడిగా గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా ఆది బాలరాజ్, కార్యదర్శిగా చింత కృష్ణ ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా శ్రీనివాస్, రామస్వామి, శేఖర్, గోపాల్ యశోద పుణ్యమ్మ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మత్స్య సహకార సంఘం అధికారి చేతుల మీదుగా నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు.ఈ సందర్బంగా నూతన అధ్యక్షులు గా ఎన్నిక అయినా అది నర్సింలు మాట్లాడతు నాపై నమ్మకం తో మాత్య పరిశ్రమిక సహకార సంగం అధ్యక్షులు ఏనుకున్న రాలకత్వ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు..

.