అక్రమ షెడ్లపై చర్యలేవి

నోటీసులతో చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు

అక్రమ నిర్మాణదారులతో అధికారుల ఒప్పందం ప్రకారమే నోటీసుల?

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) అధికారులతో ములకత్ అయితే చాలు ఎలాంటి అనుమతులు లేకున్నా అక్రమ నిర్మాణాలు చేపట్టవచ్చు కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం సర్కిల్ అంతట ఇదే తంతు నడుస్తుంది. అక్రమ నిర్మాణాల వ్యవహారంలో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులే కాకుండా పై స్థాయి అధికారుల ప్రమేయం ఉందా అని అనుమానం కలుగుతుంది గాజులరామారం సర్కిల్లో అక్రమ షెడ్ల నిర్మాణం జరుగుతున్న అధికారులు నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు ఆరోపణలు వినిపిస్తున్నా అక్రమ నిర్మాణదారులతో కుమ్మక్కై లోపాయికారిక ఒప్పందం చేసుకొని నోటీసులు ఇస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. దశలవారీగా నోటీసులు ఇస్తూ అక్రమ నిర్మాణదారుల వద్ద అందిన కాడికి వసూలు చేస్తూ గప్చుప్ గా ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ షెడ్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


.