పట్టపగలే గుప్త నిధుల తవ్వకాలు... పోలీసుల అదుపులో నిందితులు?

తెలంగాణ ప్రభ, (ములుగు జిల్లా): మంగపేట మండలం శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రానికి సమీపంలో గుప్త నిధుల వేటగాళ్లు రెచ్చిపోయారు పట్టపగలే తవ్వకాలకు తెర లేపారు. వివరాల్లోకి వెళితే జిల్లాకు చెందిన  పది మంది ముఠాగా ఏర్పడి యదేచ్చగా గుప్త నిధుల తవ్వకాలు నిర్వహిస్తున్నారు.

వీరంతా ములుగు జిల్లా వాసులే అయినట్టు సమాచారం. ఈ ముఠాకు అడవిని రక్షించాల్సిన ఫారెస్ట్ బీటు అధికారే ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు తెలుస్తోంది .

మల్లూరు గ్రామానికి  చెందిన

 గోనె. లక్ష్మీనారాయణ కు చెందిన పోడు భూమిలో తవ్వకాలు చేస్తున్నారని పక్కా సమాచారంతో మంగపేట ఎస్సై గోదరి రవికుమార్ తన సిబ్బందితో వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ముఠాలోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.  మరి కొంతమంది పరారీలో ఉన్నట్టు సమాచారం

వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నట్టు గా తెలుస్తోంది. ఫారెస్ట్ అధికారి బైక్ తో పాటు మరో ఆరు బైక్ లను స్టేషన్ కు తరలించినట్టు తెలుస్తోంది. సంఘటన స్థలంలో క్షుద్ర పూజలు నిర్వహించి పసుపు, కుంకుమలు చల్లి కోళ్లను కోసి తాటికల్లు ను ఉంచారు.

ఇదంతా చూసిన గ్రామ ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు.

.