బీడీ బట్టీలను జనావాసాలకు దూరంగా ఉంచాలి మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి

తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఆరోగ్యానికి హాని కలిగించే బీడీ బట్టిలను జనావాసాలకు దూరంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి సంబంధిత అధికారులను ఆదేశించారు.  

కోరుట్ల పట్టణంలో కమిషనర్ బట్టు తిరుపతి  ఆదేశాల మేరకు గురువారం బీడీ కంపెనీలలో తనిఖీలు నిర్వహించి జనావాసాలలో బీడీ బట్టీలు పెడుతున్న బీడీ కంపెనీ యజమానులకు బట్టీలను ప్రజలకు దూరంగా ఉంచాలని నోటీసులు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ఆకు అంజయ్య, రమేష్, రాజు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

.