పాల్గొన్న ఎమ్మెల్యే కేపి.వివేకానంద ,బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) సూరారం కట్ట మైసమ్మ దేవాలయం, దుండిగల్ లోని సింగాపురం మైసమ్మ దేవాలయాలను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి దర్శించుకుని కట్టమైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, పాక్స్ డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.