పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కోరుట్ల మండల, మున్సిపల్ స్థాయి బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

బిఆర్ఎస్ ఎం పి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ 

తెలంగాణ ప్రభ (కోరుట్ల): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కోరుట్ల పట్టణంలోని కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్లో కోరుట్ల మున్సిపాలిటీ మరియు మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నిజమాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి  బాజిరెడ్డి గోవర్ధన్ మరియు జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కలిసి పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ 

ఈ సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచార విధి విధానాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ

బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు చేసింది ఏమి లేదని, రెండు అబద్దాల పార్టీలు అబద్దాల వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడం తప్ప ప్రజలకు చేసిన లాభం లేదని ఆయన అన్నారు 

బీసీ నినాదంతో బీసీలను రెచ్చగొట్టి ఓట్లు సాధించాలనే ధర్మపురి అరవింద్ చేనేత కార్మికులు కష్టాల్లో ఉంటె, మరియు బీసీ,దళిత వర్గాల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేస్తే ఎందుకు నోరు విప్పలేదని ఆయన అన్నారు.

బడుగు బలహీనవర్గాల కోసం రైతన్నల కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు.

బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ కార్యకర్తలు అవిశ్రాంతంగా పోరాడి వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరవేసి ప్రజలకు భరోసానివ్వాలని ఆయన కోరారు. 

పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నిస్వార్థ వ్యక్తని, ఇప్పుడున్న ఎంపీ లాగా అహంకారం లేదని, అబద్దాలు ఇంకా అసలే లేవని ఆయన అన్నారు.

బాజిరెడ్డిని కోరుట్ల నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు.

.