తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ గా మామిండ్ల జ్యోతి కృష్ణ ఎన్నికయ్యారు. తూఫ్రాన్ మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న చైర్మన్ పదవి భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు గురువారం తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం నిర్వహించారు. మున్సిపాలిటీలో 16 వార్డు సభ్యులు ఉండగా ఎక్స్ అఫీషియో వార్డు సభ్యులు 1, మొత్తం 17 మంది సభ్యులకు గాను 11 మంది సభ్యులు హాజరయ్యారు. మామిండ్ల జ్యోతి కృష్ణ చైర్మన్ కావడానికి మద్దతుగా హాజరైన ప్రతి ఒక్క సభ్యులు సంపూర్ణ మద్దతు తెలపడంతో జ్యోతి కృష్ణ చైర్మన్ గా ఎంపికయ్యారు.
అదేవిధంగా 13వ వార్డు కౌన్సిలర్ నందాల శ్రీనివాస్ వైస్ చైర్మన్ గా ఎంపికైనట్లు అధికారులు తెలిపారు.
.