ఘనంగా ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) బీజేపీ పార్లమెంట్  అభ్యర్థి ఈటల రాజేందర్  జన్మదినం జన్మదిన వేడుకలు బుధవారం దుండిగల్ మున్సిపల్ బిజెపి కార్యాలయంలో కౌన్సిలర్ ఫీసరీ బాలమణి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అనంతరం కేక్ కట్ చేసి అన్నదానం చేశారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా   బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి డి విగ్నేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరు ఇంటింటికి బిజెపి కార్యక్రమం తీసుకొని మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్  అధ్యక్షులు ఏ మల్లేష్ యాదవ్  జిల్లా కోశాధికారి పీసరి కృష్ణారెడ్డి, నాయకులు డి ప్రభాకర్ రెడ్డి, ఏ శ్రీనివాస్ యాదవ్ ,వెంకటేష్ నాయక్, యశ్వంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

.