తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని, ఎమ్మెల్యే వివేకానంద ని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి బుధవారం శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో ఎన్నికల విషయంపై చర్చించారు.
