తెలంగాణ ప్రభ ( మెదక్ ): తల్లి, కొడుకులు అదృశ్యమైన సంఘటన మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం బద్రియ తండాలో చోటుచేసుకుంది. చిలప్ చెడ్ ఎస్సై షేక్ మహబూబ్ తెలిపిన వివరాల ప్రకారం.. బద్రియ్య తాండకు చెందిన పత్లోత్ శ్రీనివాస్ కు 2015లో పాపన్నపేట్ మండలం లక్ష్మీ నగర్ తాండ (పోడ్చన్ పల్లి)కి చెందిన శ్రీలాతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు అభిరాo, రఘురాం ఉన్నారు. గొడవలు జరిగితే పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతే వాళ్ళ పుట్టింటికి వెళ్లేదని, 19వ తేదీన భార్య, ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిందని తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శ్రీలా భర్త పత్లోత్ శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
