తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో గత వారం రోజులుగా జరుగుతున్న శ్రీ బీరప్ప, కామరావతి వేడుకల్లో ఎంపీపీ వుట్కూరి వెంకట రమణారెడ్డి పాల్గొని ప్రత్యేక మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా బీరప్ప కామరావతి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎంపీపీ కి డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు . అనంతరం బీరప్ప కామరావతి దేవుళ్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎంపీపీ ని, మాజీ ఎంపీపీ గుడిసే ఐలయ్య ని సన్మానించారు. ఇంత ఘనంగా నిర్వహించడం సంతోషదాయకమని, తెలంగాణ ప్రభుత్వం గ్రామ దేవతల వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. గొల్ల కురుమలకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి గుడిసేఐలయ్య, ఎంపీటీసీ నాయిని స్రవంతి రమేష్ గౌడ్,నాయిని శ్రీనివాస్, మేకల శ్రీనివాస్, కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎలుక అనిల్, నక్క రవి, యాస తిరుపతి, మాధవరెడ్డి, లెంకల రాజు, కన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
