పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయాలి

మల్టీజోన్-2 ఐజీపి పోలీస్ సుధీర్ బాబు

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ):  రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని మల్టీజోన్-2 ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ సుధీర్ బాబు కోరారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు.  సుదీర్ బాబు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా సోషల్ మీడియాపై దృష్టి పెట్టాలని సంగారెడ్డి జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నందున అక్రమ మద్యం, అక్రమ నగదు రవాణా లేకుండా సరిహద్దుల్లో గట్టి భద్రత, చెక్ పోస్ట్ లను ఏర్పాటు  చేయాలని  ఆదేశించారు. ఎవరైనా అసాంఘిక శక్తులు సోషల్ మీడియా లేక వేరే రూపంలో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మాట్లాడినా, పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఎస్పి సి.హెచ్ రూపేష్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

.