-బిఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్...
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) గాంధీనగర్ ఇండస్ట్రీ ఏరియాలో "శ్రీ సవిటర్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్" కంపెనీలో సిహెచ్ వెంకట్ రావు అనే కార్మికుడు గత ఏడు సంవత్సరాల నుంచి పనిచేసేవారు, కొన్ని అనివార్య కారణాలవల్ల కంపెనీ మానేయడం జరిగింది... వెంకట్ రవ్ అనే కార్మికుడికి రావాల్సిన గ్రాడ్యుయేట్ ఇవ్వకపోవడంతో పలుమార్లు కంపెనీ యజమాన్యాన్ని అడిగి విసుగు చెందిన కార్మికుడు తనకు తెలిసిన వారి ద్వారా బిఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ గురించి తెలుసుకొని తన ఆఫీస్ వద్దకు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించారు..వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు రవిసింగ్ హుటాహుటిన కంపెనీ వద్దకు బయలుదేరి కంపెనీ యజమాన్యంతో పలుమార్లు చర్చించి కార్మికుడికి రావలసిన ఏడు సంవత్సరాల గ్రాడ్యుయేట్ రూపాయలను ఇప్పించారు... కార్మికుడు మాట్లాడుతూ నాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవిసింగ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్,సుదర్శన్,జగన్,ప్రేమ్,బాబు రావు,తదితరులు పాల్గొన్నారు..
