తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటాం అని అంటూనే మరోవైపు కార్మికులకు తీవ్ర నష్టం జరిగే నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు అని గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి వల్లూరు బాబు అన్నాడు. ఆర్టీసీ కార్మికులకు 16 శాతంగా వున్న మధ్యంతర భృతిని కాసింత ఊరటగా 21 శాతమే పెంచి ఫిట్ మెంట్ గా నిర్ణంచడంతో నిరాషలో వున్న కార్మికులకు హెచ్ఆర్ఏ తగ్గించడం ఆర్థికంగా తీవ్ర నష్టానికి దారితీస్తుందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఇప్పటివరకు 20 శాతం హెచ్ఆర్ఏ వున్న ప్రాంతాలలో 17 శాతానికి,14.5 శాతంగా వున్న ప్రాంతాలలో హెచ్ఆర్ఏ ను 13 శాతానికి తగ్గించడం బాధకారం అని ఆవేదన వ్యక్తం చేసాడు.ఇప్పటికే తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులు హెచ్ఆర్ఏ తగ్గించడంతో ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోతున్నారని అన్నాడు. గతంలో అమలు చేసిన తీరుగానే హెచ్ఆర్ఏ ను యాదావిదిగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాడు.
