ఏసీబీకి చిక్కిన మెదక్ రూరల్ కానిస్టేబుల్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో రైటర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సురేందర్ రైటర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మెదక్ మండలం అవుసుల పల్లికి చెందిన కందుల రాములు ఇసుక ట్రాక్టర్ విడుదల విషయంలో రైటర్ సురేందర్ రూ.15 వేలు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇస్తేనే ఇసుక ట్రాక్టర్ విడుదల చేస్తామని చెప్పడంతో రూ.15 వేలు ఇవ్వడానికి రైటర్ సురేందర్ తో ఒప్పందం కుదుర్చుకొని మొదటగా నాలుగు వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. డబ్బులు డిమాండ్ చేసిన కానిస్టేబుల్ పై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుడితో మాట్లాడిన అధికారులు మంగళవారం పక్కా ప్రణాళికతో వచ్చి డబ్బులు నాలుగు వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. వారం రోజుల క్రితం పది వేలు ఇచ్చిన బాధితుడు మరోసారి డబ్బులు డిమాండ్ చేయడం వల్లనే ఏసీబీనీ ఆశ్రయించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

.