ఎల్ఓసి అందజేస్తున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
తెలంగాణ ప్రభ (నర్సాపూర్): మండల పరిధిలోని రెడ్డి ఖానాపూర్ గ్రామానికి చెందిన బల్లి నాగరాణి అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో అత్యవసర చికిత్స కోసం లక్ష రూపాయల ఎల్ఓసి ని వారి కుటుంబ సభ్యులకు మంగళవారం హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, అందజేశారు,
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగాలేకపోయినా హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్లో ఎల్ఓసి ద్వారా ఉచితంగా చికిత్స పొందవచ్చు అన్నారు, దీనిని అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలోమాజీ ఉపసర్పంచ్ వీరేశం ఉన్నారు,
.