శ్రీనివాస్ నగర్ బస్తి కమ్యూనిటీ హాల్ ను ఖాళీ చేసేంత వరకు కదిలేది లేదు.

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

తెలంగాణ ప్రభ (జగద్గిరిగుట్ట): గత 2 నెలల నుండి  జగద్గిరిగుట్ట డివిజన్ శ్రీనివాస్ నగర్ లో కమ్యూనిటీ హాల్ ను స్థానిక అప్పటి అధ్యక్షుడు నర్సింగ్ ఇతరులకు కిరాయి ఇచ్చాడని వెంటనే ఖాళీ చెయ్యండని చెపితే ఇప్పటివరకు ఖాళీ చెయ్యకుండా ఉంచటాన్ని నిరసిస్తూ నేడు శ్రీనివాస్ నగర్ బస్తి నాయకులు, సీపీఐ నాయకులు గాజులరామరం సర్కిల్ డిప్యూటీ కమీషనర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు అధికారులు ఖాళీ చేయించకుండా ఉంటే అలాగే నిరసన కొనసాగిస్తాం అని బస్తి వాసులు కూర్చోవడం వల్ల అధికారులు అక్కడికి వెళ్లి ఖాళీ చేయిస్తామని చెప్పడం వల్ల తిరిగి వెళ్లడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి ఉమా మహేష్, స్థానిక బస్తి నాయకులు మురళీ, ఖయుమ్, ప్రభాకర్,రాజేందర్, ప్రకాష్,నరేష్, కిరణ్,జానీ,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

.