రైతే దేశానికి వెన్నెముక... రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది

శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్

తెలంగాణ ప్రభ (ఎళ్ళారెడ్డిపేట): రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది దేశానికి వెన్నుముక రైతు అని ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు, 

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామ యాదవ సంఘం ఆహ్వానం మేరకు శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం లో ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్ పాల్గొని  శ్రీ మల్లికార్జున స్వామిని సోమవారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు,

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ యాదవ సోదరులు  శ్రీ మల్లికార్జున స్వామిని ప్రతి ఐదు సంవత్సరాల  కోసారి ఉత్సవాలు  ఏంతో పవిత్రతో నిర్వహించుకుని హిందూ సంప్రదాయాన్ని చాటుతున్నారన్నారు,

తెలంగాణ రాష్ట్రంలో  సకాలంలో వర్షాలు కురవాలి చెరువు కుంటలు నిండాలి పాడిపంటలు పిల్లాపాపలతో  రాష్ట్ర ప్రజలను  సుఖసంతోషాలతో సల్లంగా చూడాలని  శ్రీ మల్లికార్జున స్వామిని వేడుకొని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు ,

అనంతరం రాజన్న గొల్లపల్లి గ్రామ శివారులో శ్రీ దుర్గా మాత ప్రతిష్ట మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు , 

అనంతరం  అన్న ప్రసాదం లో కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు, 

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి  , జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగీతం శ్రీనివాస్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేపూరి రాజేశం , తిరుపతి,  కొండాపురం బాల్రెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి,  సూడిద రాజేందర్ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, బండారి బాల్ రెడ్డి ,  వెంకట్, రఫిక్,  దేవయ్య, నాయక్,  రెడ్డి ,రాములు,  బాలయ్య నరసయ్య , సుధాకర్ గౌడ్, కిషన్ , ఆంజనేయులు ,  వెంకటేష్ గౌడ్,  బొప్పాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సోషల్ మీడియా ప్రతినిధి భీపేట రాజకుమార్, గొల్లపల్లి అద్యక్షులు ముద్ర కోలా శ్రీనివాస్ , గోగూరి శ్రీనివాస్ రెడ్డి,యాదవ సంఘం వారు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

అనంతరం వచ్చిన భక్త జనానికి యాదవ్ సంఘం అన్నప్రసాదం వితరణ చేశారు,

.