ఘనంగా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర

స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద .

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతరకు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద  ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద  మాట్లాడుతూ తెలంగాణ సమాజంలో ఇంటి ఇలవేల్పులను పూజించడం, జాతరలు నిర్వహించడం ద్వారా చీడపీడలు తొలగి పిల్లా పాపలతో కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని విశ్వసిస్తారని, ఆ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దయతో అందరూ అష్టైశ్వర్యాలతో జీవించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, స్థానిక కౌన్సిలర్లు కిరణ్, రవీందర్, శివకుమార్, చింతల లక్ష్మీ దేవేందర్ యాదవ్, కో ఆప్షన్ సభ్యులు వెంకటేష్, పాక్స్ డైరెక్టర్లు బూర్గుబావి సత్యనారాయణ, కృష్ణ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మధుసూదన్ యాదవ్, పి. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

.