భూకబ్జాలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు : డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); అక్రమంగా భూ కబ్జాలు చేస్తూ రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు వసూళ్ళకు పాల్పడుతున్న తంగళ్ళపల్లి మాజీ ఉప సర్పంచ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు డిఎస్పీచంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.భూ కబ్జాలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు దైర్యంగా జిల్లా పోలీస్ కార్యక్రమంలో లో పిర్యాదు చేయవచ్చని అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ పెద్దురి తిరుపతి అనే వ్యక్తి పద్మ నగర్ గ్రామంలోని వేముల కనక నారాయణ, రాజ్య లక్ష్మి , గాజుల లత యెక్క సర్వే నెంబర్ 247 లోని భూమిని అక్రమంగా  రిజిస్ట్రేషన్ చేసుకొని వారి భూమిని వారికి రిజిస్ట్రేషన్ చేయడానికి బాధితులను బెదిరింపులకు పాల్పడుతూ వారి వద్ద నుండి భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.బాధితుల ఫిర్యాదు మేరకు తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా గతంలో లో కూడా పెద్దూరి తిరుపతి  పైన అనేక క్రిమినల్, అక్రమ డబ్బు వసూళ్ల పాల్పడిన కేసుల్లో నిందితుడని అన్నారు.పెద్దూరి తిరుపతి ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు డిఎస్పీ తెలిపారు.

.