తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని యూసుఫ్ నగర్ గ్రామానికి చెందిన కరిపే యోగేష్ అనే యువకునికి అనారోగ్యం తో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా అట్టి విషయాన్ని జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గుగ్గిళ్ళ సురేష్ గౌడ్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎల్ఓసి 1,20,000 మంజూరు చేయించినారు. అట్టి LOC ని ఎమ్మెల్యే సంజయ్ ఆదేశాల మేరకు ఈరోజు వారి కుటుంబ సభ్యులైన కరిపె మంజులకు అందజేసిన స్థానిక ఎంపీటీసీ గుగ్గిళ్ల ప్రియాంక.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గుగ్గిళ్ళ సురేష్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అచ్చ చంద్రశేఖర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు కళ్యాణ్ లు పాల్గొన్నారు.
ఆపదలో వైద్య సహాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు
.