పార్లమెంటు ఎన్నికలకు కోడ్ కూసిందిఎన్నికల నియామవళి అమలులోకి వచ్చింది నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : కోరుట్ల ఆర్డిఓ ఆనంద్ కుమార్

తెలంగాణ ప్రభ (కోరుట్ల):పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం నేటి నుండి అమలులోకి తీసుకొచ్చిందని కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.  ఎన్నికల నియమావళిని రాజకీయ నాయకులు, పట్టణ ప్రజలు అందరూ పాటించాలని అనంద్ కుమార్ సూచించారు 

శనివారం కోరుట్ల పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో పట్టణంలోని రాజకీయ పార్టీ నాయకులతో, పాత్రికేయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఎన్నికలకు సంబంధించిన నియమావళిని తెలియజేశారు. తహసిల్దార్ ఇట్యాల కిషన్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఎవరు ఉల్లంఘించిన చట్ట ప్రకారం శిక్షింపబడతారని, రాజకీయ నాయకులు, ఎన్నికల నియమావళి గురించి పూర్తి వివరాలు తమ తమ కార్యకర్తలకు తెలియజేసి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

.